‘సాహో’ నుండి పోస్టర్ విడుదలకానుంది !

Published on Oct 22, 2018 1:59 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈనెల 23 న ఆయన తన పుట్టిన రోజును జరుపుకోనున్నారని తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘సాహో’ చిత్రం నుండి స్టన్నింగ్ పోస్టర్ విడుదల కానుంది. ఈ పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదలచేయనున్నారు. ఈచిత్రం యొక్క అప్డేట్ కోసం అయాన అభిమానులు చాలా రోజులగా ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రభాస్ బర్త్ డే రోజు ఈసినిమా నుండి మరొక సప్రైజ్ రానుంది. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. ఇక ప్రభాస్ ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం తన 20వ చిత్రంలోను నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఇటలీ లో జరుగుతుంది.

సంబంధిత సమాచారం :