యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసుకున్న సాహో !

Published on Dec 6, 2018 9:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ ఈ రోజుతో మూడవ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట. త్వరలోనే ఈ చిత్రం యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ -ఎహసాన్- లాయ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కొరకు పనిచేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.

ఇక ప్రభాస్ ఈ చిత్రం తో పాటు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :