‘సాహో’ సాంగ్ టీజర్: రిచ్ లొకేషన్స్ లో రొమాంటిక్ గా…!

Published on Jul 30, 2019 1:41 pm IST

నిన్న ప్రకటించిన విధంగానే కొద్దిసేపటి క్రితం “ఏచోట నువ్వున్నా” సాంగ్ టీజర్ ని విడుదల చేశారు. ఆస్ట్రియా దేశంలోని ఆల్ప్స్ పర్వతాలలో సాగిన రొమాంటిక్ సాంగ్ చాలా రిచ్ గా ఉంది. లొకేషన్స్ కి తగ్గట్టుగా ఆకట్టుకునే సింగిల్ కలర్ డిజైనర్ వేర్ లో ప్రభాస్,శ్రద్దా కపూర్ జంట చాలా ఆకర్షణీయంగా ఉంది.లవ్ యాన్తం పేరుతో విడుదలైన 36 సెకన్ల నిడివిగల ‘సాహో’ సాంగ్ టీజర్ ఆకర్షణీయంగా సాగింది.

మొదటి సాంగ్ “సైకో సయ్యాన్” వలే ఈ పాట కూడా కొంచెం తెలుగు నేటివిటీ మిస్ అయ్యిందన్న భావన కలుగుతుంది. హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఫాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో తెలుగు నేటివిటీ గురించి మాట్లాడటం అవివేకమే అవుతుంది. ఇక పూర్తి సాంగ్ ఆగస్టు 2న విడుదల కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ పాటకు గురు రాంధవ సంగీతం సమకూర్చగా, హరి చరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాడారు. కృష్ణ కాంత్ పాటను రచించడం జరిగింది. డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 30న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :