ప్రభాస్ “సాహో” మూవీ లేటెస్ట్ అప్డేట్…!

Published on Jul 16, 2019 12:03 pm IST

“సాహో” సందడి థియేటర్లలో మొదలు కావడానికి ఇంకా కేవలం నెలరోజులే మిగిలివుంది. దీంతో “సాహో” టీమ్ అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయాలని నిర్విరామంగా పనిచేస్తున్నారు. కాగా “సాహో” మూవీ చిత్రీకరణ భాగం పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ సంధర్బంగా ప్రభాస్ ఈ చిత్రానికి పనిచేసిన సభ్యులతో సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చిత్రీకరణ పూర్తికావడంతో మిగిలిన ఈ కొద్ది సమయంలో డైరెక్టర్ సుజీత్ డబ్బింగ్ కార్యక్రమాలతో పాటు,గ్రాఫిక్ వర్క్ పూర్తి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు.భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “సాహో” చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుండగా,నీల్ నితిన్ ముఖేష్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జాకీ ష్రాఫ్,మందిరా బేడీ,మురళి శర్మ,వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More