సాయి ధరమ్ ‘చిత్ర లహరి’ కి క్లాప్ కొట్టిన ప్రముఖ దర్శకుడు !

Published on Oct 15, 2018 9:56 am IST

సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ 11వ చిత్రం చిత్ర లహరి (వర్కింగ్ టైటిల్) ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యి చిత్రానికి క్లాప్ కొట్టారు.

ఇక ఈ రోజు సాయి ధరమ్ పుట్టిన రోజు కావడం మరో విశేషం. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో చిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈచిత్రం తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :