ఫ్యాన్స్ ను కలిసి వారికి భోజనాలను పెట్టించిన సుప్రీమ్ హీరో !

Published on Jan 29, 2019 10:54 am IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన అభిమానులపై పత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. వారు ఎప్పుడు కలువడానికి వచ్చిన అందుబాటులో ఉండి వారిని ప్రేమతో పలుకరిస్తాడు. ఇక తాజాగా సాయి ధరమ్ ను కలువడానికి చిత్రలహరి షూటింగ్ సెట్ కు వెళ్లారు ఆయన ఫ్యాన్స్. అయితే షూటింగ్ మధ్యలో సాయి ధరమ్ వారిని కలిసి ఫోటోలు దిగి అందరికి భోజనాలను పెట్టించి పంపించారు.

ఇక చిత్రలహరి షూటింగ్ హైద్రాబాద్లో ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్లో శరవేగంగా జరుగుతుంది. కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More