తన పేరు మీద జరుగుతున్న మోసాన్ని బయటపెట్టిన ధరమ్ తేజ్

Published on Apr 30, 2021 10:30 pm IST

సినిమా స్టార్ల పేరు వాడుకుని మోసాలు చేసేవారు కోకొల్లలు. కొందరు పలానా హీరో సినిమాలో అవకాశం ఇప్పిస్తామని ఆశావహుల నుండి డబ్బులు వసూలు చేసేవాళ్ళు కొందరైతే ఇంకొందరు తామే హీరోలమని, హీరోయిన్లమని చెప్పి డబ్బులు గుంజేవాళ్లు ఉన్నారు. ఇలాంటి మోసగాళ్ల వలన చాలామంది నటీనటులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడ ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నాడు. తానే సాయి తేజ్ అని చెప్పి ఎవరో తేజ్ సన్నిహితుల వద్ద, కోస్టార్ల ఆర్థిక సహాయం అడుగుతున్నాడట.

సన్నిహితుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న సాయితేజ్ వెంటనే అలర్ట్ అయ్యారు. ల్ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఎవరో నా పేరు మీద నేను పనిచేసిన సహచరుల నటులు, ఇతరుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. నాకు ఆర్థిక సాయం కావాలని వారిని అడుగుతున్నాడట. ఈ విషయంపై నేను పోలీసులకు పిర్యాదు చేస్తున్నా. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాటిని నమ్మకండి. నాపేరు మీద వచ్చే సందేశాలను పట్టించుకోకండి’ అంటూ క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :