మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కానున్న సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా ‘రేయ్’. ఈ సినిమా చాలా కాలం క్రితమే పూర్తయినప్పటికీ ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల వాయిదా పడింది. ఆ సినిమా విడుదల ఆలస్యం అవుతుండడంతో సాయి ధరమ్ తేజ్ తను చేసిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’పై దృష్టి పెట్టి దానిని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ కూడా తన పార్ట్ కి డబ్బిండ్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం శబ్దాలయా స్టూడియోస్ లో డబ్బింగ్ చెబుతున్న సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ పార్ట్ త్వరలోనే ఫినిష్ అవుతుందని ఈ చిత్ర టీం తెలిపారు. ఈ సినిమా ఆడియో వేడుక అక్టోబర్ 25న అందరు మెగా హీరోల సమక్షంలో జరగనుంది.
అలాగే ఈ చిత్ర టీం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 14న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.


