ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలిచిన సాయి తేజ్.!

Published on Sep 19, 2020 10:09 am IST

మన టాలీవుడ్ హీరోలు ఎవరికైనా కష్టం ఉందంటే చాలా తప్పకుండా సాయం చేస్తారు.అలా ఒక హీరోగా వెండితెర మీద ఎంతగానో ఆకట్టుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తాను ఒక ఏడాది కితం ఇచ్చిన మాటను పూర్తి చేసుకొని నిజ జీవితంలో కూడా హీరోగా నిలిచారు.

గత ఏడాది అక్టోబర్ నెలలో ఈసారి తన పుట్టినరోజుకు విజయవాడకు చెందిన అమ్మ ఆదరణ సేవ ఓల్డేజ్ హోమ్ వారికి సంబంధించిన ఒక ఇల్లు నిర్మాణ దశలో ఉంది. అపుడు వారు దాతల కోసం ఎదురు చూడగా సాయి తేజ్ వెంటనే స్పందించి తాను ఆ భాధ్యతను తీసుకొంటానని తెలిపి మాట ఇచ్చారు.

ఇప్పుడు ఆ మాట ప్రకారం సాయి తేజ్ తన అసిస్టెంట్స్ చేత ఆ గృహ నిర్మాణాన్ని పూర్తి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇపుడు బయటకు వచ్చాయి. అయితే అపుడు సాయి తేజ్ తేజ్ పిలుపు మేరకు మెగా ఫ్యాన్స్ కూడా ఒక లక్ష రూపాయలు వరకు సాయం చేసారని చెప్పుకొచ్చారు.

ఇపుడు వారి ఉడతా సాయానికి సాయి తేజ్ తోడయ్యి ఆ నిస్సహాయ వృద్ధులకు ఒక ఇంటిని అందించారు. ఇపుడు పూర్తి కాబడిన ఈ ఇంటికి మరియు వారికి ఒక ఏడాది పాటు ఆర్ధికంగా అండగా నిలుస్తానని తెలిపారు. ఈ ఇన్సిడెంట్ తో సాయి ధరమ్ తేజ్ మరో మెట్టు ఎక్కారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More