సెకెండ్ వేవ్ బ్రేక్ ను అలా వాడుకుంటోన్న హీరో !

Published on May 2, 2021 1:00 am IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మారుతితో కలిసి చేసిన ‘ప్రతిరోజూ పండగే’ సూపర్ హిట్ అవ్వడంతో సాయి తేజ్ మార్కెట్ అమాంతం పెరిగింది. ఆ మార్కెట్ వల్లే ‘సోలో లైఫ్ సో బెటర్’ సినిమాకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ప్రస్తుతం రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కరోనా సెకెండ్ వేవ్ తగ్గాక ఈ సినిమా రిలీజ్ కానుంది. దేవా కట్టా దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

కాగా సాయి తేజ్ ప్రస్తుతం వరుసగా కథలు వింటున్నాడు. సెకండ్ వేవ్ వల్ల వచ్చిన గ్యాప్ ను ఇలా కథలు వింటూ కవర్ చేస్తున్నాడట. ఇప్పుడు పలు చిత్రాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. అందులో డైరెక్టర్ శ్రీవాస్ తో కూడా ఓ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉందని తెలుస్తోంది. అలాగే సాయి తేజ్ తెలుగే కాకుండా తమిళ్ డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ కూడా వింటున్నాడని.. తమిళ మార్కెట్ పై కూడా పట్టు పెంచుకోవడానికి సాయి తేజ్ ప్లాన్ లో ఉన్నాడని సమాచారం.

సంబంధిత సమాచారం :