సుక్కు రైటింగ్స్ లో ఆసక్తి రేపుతున్న సాయి తేజ్.!

Published on Aug 14, 2020 1:58 pm IST

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ ఆరంభంలో మంచి విజయాలు అందుకున్నా తర్వాత తర్వాత మాత్రం తన ప్రాజెక్టుల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలాన మళ్ళీ హిట్లు అందుకోడానికి చాలా కాలమే పట్టింది. గత ఏడాది మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన “ప్రతీరోజూ పండగే” చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు.

ఇక ఇక్కడ నుంచి సాయి తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రాజెక్టులను ఎన్నుకొంటున్నారు. అదే బాటలో లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన తన 15 వ చిత్రం ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. “సిద్ధార్థి నామ సంవత్సరే, బృహ‌స్ప‌తిః సింహరాశౌ స్థిత న‌మ‌యే, అంతిమ పుష్క‌రే” అని సంస్కృత వాక్యంతో ఒక చక్రంలో సాయి తేజ్ ఒక కంటితో చూస్తున్న ఈ పోస్టర్ మంచి హైప్ ను తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా తన మోస్ట్ ఫేవరెట్ దర్శకుడు సుకుమార్ తో కలిసి పని చేయడం చాల ఆనందంగా ఉందని సాయి తేజ్ తెలిపారు. అయితే ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుక్కు రైటింగ్స్ లో పని చేసిన యువ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించనున్నారు. అలాగే ఈ మిస్టికల్ థ్రిల్లర్ ను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా ఇతర క్యాస్టింగ్ విషయాలను అతి త్వరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం :

More