మరోసారి వెలుగులోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’

Rey-New-Posters-1
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయిన మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో చేసిన మొదటి సినిమా ‘రేయ్’. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడు సంవత్సరాలైనా పైనే అయ్యింది, అలాగే షూటింగ్ పూర్తి చేసుకొని కూడా ఒక సంవత్సరం దాటింది. అయినా రిలీజ్ కి మాత్రం నోచుకోలేదు. ఇదిగో రిలీజ్, అదిగో రిలీజ్ అంటూ ఈ చిత్ర టీం అంటూనే ఉంది కానీ ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల వెనక్కి వెళుతూనే ఉంది. ఈ కారణంగా సాయి ధరమ్ తేజ్ నటించిన రెండవ సినిమా అయిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

పిల్లా నువ్వులేని జీవితం హిట్ అవ్వడం ఈ సినిమాకి కాస్త హెల్ప్ అయ్యింది. ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రేయ్ కి మరో కొత్త రిలీజ్ డేట్ వినపడుతోంది. ఫైనాసియర్స్ ముందుకు రావడంతో వైవిఎస్ చౌదరి ఈ సినిమాని జనవరి 30న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. శ్రద్ధ దాస్, సయామీ ఖేర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. కరేబియన్ దీవుల్లో, యుఎస్ లో షూట్ చేసిన ఈ సినిమా విజయంపై వైవిఎస్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

Exit mobile version