గోపీచంద్‌ సినిమాలో సాయి పల్లవి ?

Published on Jan 18, 2021 1:00 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’లో హీరోయిన్ అలిమేలు మంగ పాత్ర చాల కీలకమైనది, పైగా సినిమా కూడా ఈ పాత్ర మీదే నడుస్తోంది. అందుకే ఆ పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిను ఫైనల్ చేశారని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే స్టార్ హీరోయిన్ల పేర్లని కూడా తేజ పరిశీలించారు. వారిలో మెయిన్ కాజల్‌, అనుష్కలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు.

కానీ వాళ్ళు సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో మిగిలిన హీరోయిన్స్ లిస్ట్ ను చూడగా.. హీరోయిన్ కీర్తి సురేష్ అయితే బాగుంటుందని మొదట అనుకున్నా కీర్తి వరుస సినిమాలతో బిజీగా వుంది. ఈ మధ్యలో సాయి పల్లవిను అనుకున్నారు, ఫైనల్ గా ఆమెనే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :