విషాదం..సాయి పల్లవి లేటెస్ట్ సినిమా నిర్మాత మృతి.!

Published on May 26, 2021 8:00 am IST

మన తెలుగు మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో పలు ఆసక్తికర చిత్రాలు ఇతర భాషల నుంచి డబ్ అయ్యి మంచి ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. అలాగే మరో పక్క మన టాలీవుడ్ లో పలు విషాదకర వార్తలు కూడా వినాల్సి వస్తుంది. మరి ఇదే ఆహాలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “అథిరన్”.

తెలుగులో “అనుకోని అతిథి” గా డబ్ అయ్యి 2019లోనే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాలతో చేత ఆహా లో ప్రీమియర్స్ కు రెడీగా ఉంది. కానీ ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరించిన అన్నం రెడ్డి కృష్ణ కుమార్ ఈరోజు ఉదయం విశాఖలో ఆకస్మిక గుండెపోటుతో మరణించారని తెలిసింది. దీనితో మరోమారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. మరి వారి పవిత్ర ఆత్మకు చేకూరాలని మా 123 తెలుగు యూనిట్ ప్రగాడ సానుభూతిని వ్యక్తపరుస్తుంది.

సంబంధిత సమాచారం :