విలువలు కోసం కోట్లు వదులుకున్న క్రేజీ హీరోయిన్ !

Published on May 26, 2019 11:00 pm IST

డబ్బులు కోసం ఎలాంటి హద్దులనైనా అవలీలగా దాటే హీరోయిన్లు ఉన్న ఈ రోజుల్లో… తన సిద్దాంతాలకు మరియు తను నమ్మే విలువలకు కట్టుబడి కోట్ల రూపాలను వద్దనే హీరోయిన్స్ చాలా అరుదుగా కనబడుతుంటారు. తెలుగులో ప్రస్తుతం అలాంటి హీరోయిన్లు గురించి చర్చించుకోవాలంటే.. ప్రముఖంగా ముచ్చటించుకోవాల్సింది హీరోయిన్ సాయి పల్లవి గురించే. ఎందుకంటే సాయి పల్లవి ఎప్పుడూ తను నమ్మిన విలువలకు ఎప్పుడూ కట్టుబడుతుంది. ఓ యాడ్ ఫిల్మ్ లో నటిస్తే.. రెండు కోట్లు ఇస్తామన్నా నో చెప్పిందట.

ఇటీవలే ఓ సౌందర్యోత్పత్తుల సంస్థ తమ ఫెయిర్‌ నెస్‌ క్రీముల యాడ్ లో నటించమని కోరగా సాయి పల్లవి మాత్రం ఆలోచించకుండా వెంటనే నో చెప్పేసింది. నిజానికి సాయి పల్లవి పెద్దగా ఎలాంటి ఫెయిర్‌ నెస్‌ క్రీములు వాడదు. పైగా సినిమాల కోసం మేకప్‌ కూడా లైట్ గా టచప్ వేసుకుంటుంది. అందుకే తానెప్పుడూ ఫెయిర్‌ నెస్‌ క్రీముల్లాంటి యాడ్స్ లో యాక్ట్ చేయనని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :

More