తెలుగులోకి డబ్ కానున్న సాయి పల్లవి హిట్ చిత్రం !
Published on Jul 26, 2017 4:02 pm IST


ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవి పేరు తెగ హడావుడి చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన ‘ఫిదా’ చిత్రం పెద్ద హిట్టవడమే ఇందుకు కారణం. ఆ సినిమాలో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చేసిన మొదటి డైరెక్ట్ తెలుగు సినిమాతోనే ఆమె భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. పైగా ఆమె సైన్ చేసి షూటింగ్ చేస్తున్న తెలుగు సినిమాలకు కూడా మంచి హైప్ లభిస్తోంది.

దీంతో ఆమె మలయాళంలో చేసిన సూపర్ హిట్ చిత్రం ‘కాళీ’ ని తెలుగులోకి డబ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఈ తెలుగు డబ్బింగ్ హక్కుల్ని నిర్మాత డి.వి. కృష్ణ స్వామి సొంతం చేసుకున్నారు. 2016లో విడుదలైన ఈ చిత్రాన్ని సమీర్ తాహిర్ డైరెక్ట్ చేయగా స్టార హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయం ఇంకా నిర్ణయం కాలేదు.

 
Like us on Facebook