సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం అప్డేట్స్ !

Published on Feb 13, 2019 8:35 am IST

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ ‘రాక్షసన్’ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ‘రైడ్ , వీర’ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈచిత్రం ఈనెల 21న అధికారికంగా లాంచ్ కానుంది. ఇక ఒరిజినల్ వెర్షన్ లో క్రిస్టోఫర్ అనే విలన్ పాత్రలో నటించిన నటుడినే ఈ రీమేక్ లో కూడా కొనసాగించే అవకాశం వుంది. ఒరిజినల్ వెర్షన్ లో విష్ణు విశాల్ హీరోగా నటించగా రామ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విలన్ పాత్రే మేజర్ హైలైట్అయ్యింది.

ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘సీత’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది. మరి ఈ రెండు చిత్రాలతో సాయి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :