మెగా హీరోతో టాలెంటెడ్ డైరెక్టర్ ?

Published on Feb 28, 2020 2:15 am IST

మెగా హీరో సాయి తేజ్ ఎట్టకేలకూ ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని తరువాత సినిమాల పై దృష్టి పెట్టాడు. కాగా ప్రస్తుతం కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్షన్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే షూట్ జరుగుతుండగా మే 1న చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రం తర్వాత సాయితేజ్ దేవ కట్ట దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం చేయనున్నారని తెలుస్తోంది.

కాగా సాయి తేజ్ కోసం దేవ కట్ట ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంబంధించి మంచి స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల తర్వాత ఒక నెలకు ఈ చిత్రం స్టార్టవుతుందట. అయితే ఈ సినిమా దేవ కట్ట గత సినిమాల మాదిరిగా కాకుండా ఫుల్ కమర్షియల్ హంగులతో పాటు బలమైన సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More