“రిపబ్లిక్” ఫస్ట్ లుక్ తో ఆసక్తి రేపిన సాయి తేజ్.!

Published on Mar 25, 2021 10:59 am IST

వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో మళ్ళీ తన ట్రాక్ లోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వచ్చేసాడు. లేటెస్ట్ గా సోలో బ్రతుకే సో బెటర్ తో సాలిడ్ హిట్ అందుకున్న సాయి తేజ్ ఆ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ లైనప్ ను పెట్టుకున్నాడు. మరి వాటిలో టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్ట తో “రిపబ్లిక్” అనే చిత్రం కూడా ఒకటి.

టైటిల్ తోనే ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అందరికీ అర్ధం అయ్యింది. మరి ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం నుంచి అభి గా సాయి తేజ్ పై డిజైన్ చేసిన “రిపబ్లిక్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. “డబ్భై నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉందని భ్రమలో ఉన్నాం. కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు” అనే ఇంట్రెస్టింగ్ లైన్ ను పైన సెట్ చేశారు.

అలాగే సాయి తేజ్ ను ఒక స్కెచ్ రూపం లో చూపిస్తూ తన గ్లాసెస్ లో రెండు గ్రూపులుకు మధ్య ఓ వ్యక్తి హైలైట్ గా కనిపిస్తున్నాడు. ఇలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కాస్త ఆసక్తి రేపుతోంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని జె బి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే జూన్ 6న ఈ చిత్రాన్ని విడుదలకు కన్ఫర్మ్ చేసారు..

సంబంధిత సమాచారం :