త్వరలో మొదలుకానున్న మెగా హీరో కొత్త సినిమా

Published on Nov 12, 2019 3:00 am IST

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్న మెగా హీరో సాయి తేజ్ తాజాగా కొత్త సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేయనున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనేది ఈ సినిమా టైటిల్ నిర్ణయిచారు. గత నెలలోనే పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభమైంది.

మొదటి షెడ్యూల్ ఈ నవంబర్ నెల 19 నుండి మొద లుకానుంది. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ చిత్రం రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటెర్టైనర్ గా ఉండనుంది. ఈ చిత్రంలో నభా నటేష్ కథానాయకిగా నటించనుంది. ఇకపోతే తేజ్ ప్రస్తుతం చేస్తున్న ‘ప్రతిరోజు పండగే’ సినిమా డిసెంబర్ 20న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More