‘భగవద్గీత సాక్షిగా’ అనే టైటిల్ తో మెగాహీరో మూవీ

Published on Jul 15, 2020 11:10 pm IST


యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది ఓ మంచి హిట్ అందుకున్నారు. ఆయన నటించిన ప్రతి రోజూ పండగే భారీ హిట్ కొట్టింది. ధరమ్ తేజ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆ మూవీ నిలిచింది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ చిత్రాన్ని దర్శకుడు మారుతీ అద్భుతంగా తెరకెక్కించారు.

కాగా సాయి ధరమ్ ఓ కొత్త దర్శకుడికి నెక్స్ట్ మూవీ కోసం పచ్చ జెండా ఉపాడట. ఆ సినిమా టైటిల్ కూడా భగవద్గీత సాక్షిగా అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ప్రస్తుతం ధరమ్ తేజ్ సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ అనే మూవీ చేస్తున్నారు. అనంతరం దేవా కట్టాతో ఓ మూవీ చేస్తారు.

సంబంధిత సమాచారం :

More