మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిన సినిమా ‘దృశ్యం’. మోహన్ లాల్ నటించగా జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2013లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగు మరియు కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ రీమేక్ సెట్స్ పై ఉంది.
ఇప్పటి వరకూ సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ కి కూడా వెళ్లనుంది. వయోకాం పిక్చర్స్ వారు రీమేక్ రైట్స్ కొనుక్కున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా కనిపించనున్నాడు. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ జీతు జోసెఫ్ ప్రస్తుతం తమిళ రీమేక్ లో బిజీగా ఉండడం వలన హిందీ వెర్షన్ ని అతను డైరెక్ట్ చేయడం లేదు. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు.? హిందీలో సైఫ్ కి జోడీగా నటించే నటీనటులెవరు అనే విషయాలు త్వరలోనే తెలిసే అవ్కాసహం ఉంది.


