పవర్ ఫుల్ గా “విక్రమ్ వేద” నుండి సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్

Published on Feb 24, 2022 12:40 pm IST


బాలీవుడ్ అప్ కమింగ్ మూవీ విక్రమ్ వేద నిర్మాతలు సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సైఫ్ విక్రమ్ అనే పోలీసుగా నటిస్తున్నాడు. విక్రమ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. సైఫ్ తెల్లటి టీ షర్ట్ మరియు బ్లూ జీన్స్ ధరించాడు. ఈ లుక్ లో సైఫ్ మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

ఈ సినిమా గురించి చెప్పాలంటే, పుష్కర్-గాయత్రి దర్శకత్వంలో హృతిక్ రోషన్ వేదా పాత్రలో నటిస్తున్నాడు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది మరియు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సంబంధిత సమాచారం :