“ఆదిపురుష్” లో సైఫ్ ను స్పెషల్ గా చూపిస్తున్నారా.?

“ఆదిపురుష్” లో సైఫ్ ను స్పెషల్ గా చూపిస్తున్నారా.?

Published on Jan 5, 2021 10:02 AM IST

Saif Ali Khan

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న మైథలాజికల్ వండర్ “ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ మహత్తర చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటించనున్నాడు.

అయితే ఇక రావణ పాత్రకు గాను బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ఖరారు చేసేసారు. ఇక ఇదిలా ఉంటే ఈ భారీ చిత్రంలో సైఫ్ రోల్ కు సంబంధించి ఓ లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రావణానునిగా సైఫ్ ను కాస్త ప్రత్యేకంగా చూపిస్తారట. ఇప్పుడున్న నార్మల్ హైట్ కన్నా ఎత్తుగా సుమారు 9 అడుగులు పొడవు మేర సైఫ్ ను రావణ పాత్రలో చూపించనున్నారని తెలుస్తుంది.

అందుకు తగ్గట్టుగా స్పెషల్ మేకప్ మరియు ఎఫెక్ట్స్ ను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారట. అంతే కాకుండా సైఫ్ ముఖంలో కూడా గట్టి మార్పులే కనిపించనున్నాయని సమాచారం. ఇక భారీ ఇతిహాస చిత్రాన్ని ఇండియన్ స్క్రీన్ పైనే బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా తెరకెక్కించనున్నారు.

తాజా వార్తలు