కేరళ కోసం సాయి పల్లవి సాయం !

Published on Aug 18, 2018 3:13 pm IST

గత 10రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న దక్షిణాది రాష్ర్టం కేరళను ఆదుకోవడానికి చాలా మంది సినీ తారలు ముందుకొస్తున్నారు. తమ వంతు సహాయంగా విరాళాలను అందజేస్తున్నారు.

తాజాగా యువ హీరోయిన్ సాయి పల్లవి తన వంతు సాయంగా 35లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం గా ఇచ్చారు. ఇక సాయి పల్లవి ‘ప్రేమమ్’ చిత్రంతో మలయాళీ తెరకు పరిచయమై చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ‘పడి పడి లేచె మనుసు, మారి 2, ఎన్జికె’ చిత్రాల్లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More