డిఫెరెంట్ షేడ్స్ లో సాయిరాం శంకర్…”ఒక పథకం ప్రకారం” పోస్టర్ ను విడుదల చేసిన ఆర్జీవీ

Published on Jan 26, 2022 11:20 am IST


నటుడు, పూరీ జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్‌ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు విడుదల చేశారు. తన నెక్స్ట్ మూవీ కి డిఫెరెంట్ టైటిల్ ను ఖరారు చేసారు సాయిరాం శంకర్. ఒక పథకం ప్రకారం అనే టైటిల్ తో విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ సాయిరామ్ శంకర్ ని డిఫరెంట్ షేడ్స్ లో చూపించి ఆకట్టుకునేలా ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది.

ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో కథా నాయికలుగా పటాస్ ఫేమ్ శృతి సోధి మరియు నాటకం ఫేమ్ అషిమా నర్వాల్ లు ఎంపికయ్యారు. జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు సముద్రఖని కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వినోద్ విజయన్ ఫిలింస్ బ్యానర్‌ పై రవి పచ్చమూతు, గార్లపాటి రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రాజ్, గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రం లో కళా భవన్ మణి, రవి పచ్చముత్తు, భాను శ్రీ, పల్లవి గౌడ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :