సంజయ్ దత్ డబుల్ ట్రీట్…!

Published on Jul 29, 2019 10:28 pm IST

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తన పుట్టిన రోజుని పురస్కరించుకొని ఫ్యాన్స్ డబుల్ ఫీస్ట్ ఇచ్చారు. ఆయన “కెజిఎఫ్ 2″ చిత్రంలో చేస్తున్న ప్రతినాయకుడు అధీరా పాత్ర లుక్ ని విడుదల చేయడంతో పాటు, ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న” ప్రస్థానం” చిత్ర టీజర్ ని విడుదల చేయడం జరిగింది.

అధీరాగా ఆయన కిల్లర్ లుక్ కి అద్భుత స్పందన లభించింది. సోషల్ మాధ్యమాలలో ఆయన లుక్ విపరీతంగా వైరల్ అయింది. రాఖీ భాయ్ కి అధీరా అసలుసిసలైన సవాల్ గా మారతాడు అనిపిస్తుంది. వీరిద్దరి మధ్య పోరాటాలు ఏ రేంజ్ లో వుంటాయో అని అభిమానులు అప్పుడే ఊహల్లో తెలియాడుతున్నారు.

అలాగే 2010లో వచ్చిన తెలుగు చిత్రం “ప్రస్థానం” హిందీ రీమేక్ లో కూడా సంజయ్ నటిస్తున్నారు. దర్శకుడు దేవా కట్టా, సాయికుమార్, శర్వానంద్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “ప్రస్థానం” చిత్రం పొలిటికల్ డ్రామాలలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దర్శకుడు దేవా కట్టాకి ఈ చిత్రం ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఇంటర్నేషనల్ వేదికపై ఈ మూవీ ప్రదర్శించడంతో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది.

హిందీ “ప్రస్థానం” చిత్రానికి కూడా దేవా కట్టానే దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సాయి కుమార్ పాత్రను సంజయ్ దత్ చేస్తుండగా, శర్వానంద్ పాత్రలో ఫైజల్ అలీ నటిస్తున్నారు. జాకీ ష్రాఫ్, మనీషా కొయిరాలా, అమైరా దస్తర్ ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. టీజర్ లో సంజయ్ నటన చాలా ఇంటెన్సివ్ గా ఉంది. నిర్మాణ పరంగా కూడా ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో దేవా కట్టా తెలుగు వెర్షన్ కి మించి బాగా తీస్తారనిపిస్తుంది.

సంజయ్ దత్ సొంత నిర్మాణ సంస్థ ఎస్డీపీ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :