“సలార్” నుంచి అవైటెడ్ భారీ ట్రీట్ రాబోతోందా.?

Published on Sep 25, 2022 7:02 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. దీనిపై మాస్ జనంలో భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ ఇంట తీరని విషాదం నెలకొనగా దీని నుంచి తేరుకొని ప్రభాస్ అయితే మళ్ళీ తన సినిమాల్లోకి వచ్చాడు.

అలాగే సలార్ షూట్ కూడా స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరో పక్క అయితే ప్రభాస్ బర్త్ డే కూడా దగ్గర పడుతుండడంతో తన సినిమాలకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి సలార్ నుంచి అయితే ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మెన్స్ గ్లింప్స్ ఇపుడు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రభాస్ బర్త్ డే కానుకగా అయితే ఎంతో కాలం గా ఎదురు చూస్తున్న ఈ భారీ ట్రీట్ రానుందట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :