టాప్ లో ట్రెండ్ అవుతోన్న “సలార్”

టాప్ లో ట్రెండ్ అవుతోన్న “సలార్”

Published on Jan 22, 2024 5:49 PM IST


పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం రీసెంట్ గా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. సలార్ ఇప్పుడు ఓటిటి లో కూడా సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు