‘సలార్’ టివి ప్రీమియర్ : టిఆర్పి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా ?

‘సలార్’ టివి ప్రీమియర్ : టిఆర్పి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా ?

Published on Apr 21, 2024 2:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ సలార్. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈమూవీ గత ఏడాది డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకుని రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది. అనంతరం ఓటిటి లో రిలీజ్ అయి ఆడియన్స్ ని అలరించిన సలార్ రేపు సాయంత్రం 5 గం. 30 ని. లకు స్టార్ మా ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది.

దానితో ఈ మూవీ ఎంతమేర టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంటుందనే దాని పై అందరిలో మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక తెలుగు మూవీస్ లో ఇప్పటివరకు అత్యధిక టిఆర్పి అందుకున్న సినిమాగా అలవైకుంఠపురములో 29.4 రేటింగ్ తో టాప్ స్థానంలో నిలిచింది. మరి పాన్ ఇండియన్ స్టార్ గా మంచి క్రేజ్ సొంతము చేసుకున్న ప్రభాస్ ఈ రికార్డు ని బ్రేక్ చేస్తారా లేదా అనేది చూడాలి. పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు చేసిన సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు