తన వల్లే తన తమ్ముడి కెరీర్ పోయిందన్న స్టార్ హీరో

తన వల్లే తన తమ్ముడి కెరీర్ పోయిందన్న స్టార్ హీరో

Published on Aug 5, 2018 5:28 PM IST

salmankhan2

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ స్టార్ డమ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి స్టార్ హీరో తమ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ప్రతి దర్శకుడు ప్రతి నిర్మాత కోరుకుంటారు. కానీ తన వల్లే తన తమ్ముడి కెరీర్ పోయిందని సల్మాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యాలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తన తమ్ముడు అర్బాజ్‌ ఖాన్‌ అర్బాన్‌ తన తొలి రెండు చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. దాంతో అర్బాజ్‌ ఖాన్‌ సూపర్‌స్టార్‌ గా రాణిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన తన కెరీర్ ను సక్సెస్‌ ఫుల్ గా కొనసాగించలేకపోయారు.

దీనికి కారణం తనే అని సల్మాన్‌ ఖాన్‌ ఓ చాట్ షోలో చెప్పారు. సల్మాన్‌ మాట్లాడుతూ.. తన తమ్ముళ్లు కెరీర్ ను తాను సరిగ్గా ప్లాన్ చేయలేకపోయానని దర్శక, నిర్మాతలు కూడా తన స్టార్‌డమ్‌తో అర్బాజ్‌, సొహైల్‌ స్టార్‌డమ్‌ను పోల్చేవారని దాంతో వారు వెనుకబడే వారని, ఆ కారణంగా నిర్మాతలు వారికీ ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ ”భారత్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు