ప్రాణహాని ఉంది హాజరుకాలేనన్న సూపర్ స్టార్.

ప్రాణహాని ఉంది హాజరుకాలేనన్న సూపర్ స్టార్.

Published on Sep 28, 2019 8:31 AM IST

salmankhan2

సల్మాన్ ఖాన్ మరో మారు కోర్ట్ కి విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆయన నిన్న రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్ట్ కి హాజరు కావాల్సివుండగా, ప్రాణ హాని ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేరని ఆయన తరపు లాయర్ జడ్జికి వివరణ ఇవ్వడం జరిగింది. దీనితో ఈ కేసు మరలా రేపటికి వాయిదా వేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ కి ఇటీవల కొందరు దుండగుల నుండి చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. దీనిపై స్పందించిన పోలీసులు ఆ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు.

1998వ సంవత్సరంలో హమ్ సాత్ సాత్ హై చిత్ర షూటింగ్ కొరకు జోధాపూర్ వెళ్లిన సల్మాన్ అక్కడ కృష్ణ జింకలను వేటాడారు అనే అభియోగం ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో భాగంగా 2007లో సల్మాన్ ఒక వారం జోద్ పూర్ జైల్లో గడిపారు. ప్రస్తుతం సల్మాన్ నటించిన దబాంగ్ 3 డిసెంబర్ 20న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం ప్రభుదేవా వహించగా సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు