ఈసారి ఈద్ కి హిట్ మూవీ సీక్వెల్ తో రానున్న స్టార్ హీరో.

Published on Aug 27, 2019 3:37 pm IST

సల్మాన్ ఖాన్ ఈ సారి రంజాన్ కానుకగా కిక్ 2 తో వస్తున్నట్లుగా ప్రకటించేశాడు. నిజానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఇన్షాల్లా అనే చిత్రం వచ్చే ఈద్ కానుకగా విడుదల చేయాలని సల్మాన్ భావించారు. కారణాలేమైనా ఈ చిత్రం ఆగిపోయింది. దీనితో సల్మాన్ ఫ్యాన్స్ కి మరో చిత్రం కిక్ 2 తో ఈసారి ఈద్ కి సందడి చేస్తానంటూ హామీ ఇచ్చారు.

తెలుగులో రవి తేజా హీరోగా, దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన కిక్ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలో సల్మాన్ అదే పేరుతో రీమేక్ చేసి 2014 లో విడుదల చేసి మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఆ చిత్ర సీక్వెల్ గా కిక్2 తీయాలని ప్రణాళిక వేశారు. కాగా సల్మాన్ నటించిన దబాంగ్ 3 డిసెంబర్ 20న విడుదల కానుంది.ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :