మరోసారి కలసినటించనున్న సమంత ప్రణీత?

మరోసారి కలసినటించనున్న సమంత ప్రణీత?

Published on May 28, 2014 12:26 AM IST

samantha-praneetha

టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్స్ తరుచు రిపీట్ అవుతుంటాయి. అయితే ఎప్పుడు ఒక హీరో దర్శకుడు లేక ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్స్ మాత్రమే రిపీట్ అవుతుంటాయి. ఈసారి దీనికి భిన్నంగా ఇద్దరు హీరోయిన్లు స్క్రీన్ స్పేస్ ని పంచుకోనున్నారు. వారు సూపర్ స్టార్ సమంత మరియు ప్రణీత.

అంతా సవ్యంగా జరిగితే ఈ ఇద్దరు అందాలబొమ్మలు మూడో సారి కలసినటించనున్నారు. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లో అలరించిన వీరివురు తర్వాత యెన్. టి. ఆర్ ‘రభస’ లో నటిస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తీస్తున్న తాజా చిత్రంలో కనిపిస్తారు.

తాజా సమాచారం ప్రకారం సమంత తో పాటు ప్రణీతని కూడా అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రంలో తీసుకోడానికి త్రివిక్రమ్ ఆశక్తికనబరుస్తున్నారని సమాచారం. త్వరలో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని విషయాలు తెలియాలంటే 123తెలుగు ఫాలో అవ్వండి.

తాజా వార్తలు