శమంతకమణి ఫస్ట్ డే కలెక్షన్స్ !
Published on Jul 15, 2017 6:06 pm IST


శుక్రవారం విడుదలైన మల్టీస్టారర్ చిత్రం శమంతకమణి కి మంచి రివ్యూలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈచిత్రం తొలిరోజు రూ 1.5 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ క్రమంగా వ్యాపిస్తున్నాయి తరుణంలో రానున్నరోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ చిత్రం లో నలుగురు హీరోలు నటిస్తుండడంతో మంచి పబ్లిసిటీ లభించింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రానికి నాని నిన్నుకోరి నుంచి గట్టి కాంపిటీషన్ ఎదురవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook