బామ్మగా మారిపోయిన భామ… సమంత “ఓహ్ బేబీ” టీజర్

Published on May 25, 2019 6:57 pm IST

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంతో ఈ మూవీ వస్తోంది.

“నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి… చూస్తారు గా” అంటోంది సమంత . కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా నందిని రెడ్డి సమంతతో తీస్తున్న లేటెస్ట్ మూవీ ఓ బేబీ … సినిమా పేరు వినగానే సమంత ఏజ్ కాస్త తగ్గింది అనిపిస్తుంది గానీ అసలు విషయం మాత్రం అరవై ఏళ్ళ బామ్మ ఆత్మ ఇరవై ఏళ్ళ అమ్మాయిలో కి వెళ్లి చేసే అల్లరి ఈ సినిమా కధాంశం .

టీజర్ చూస్తే సమంత ఈ మూవీలో సింగర్ అని తెలుస్తుంది. సీనియర్ నటి లక్ష్మీ వయసులో ఉన్నప్పటి బ్యాక్ గ్రౌండ్ సీన్స్ లో వచ్చే పాత్రను సమంతా నే చేసినట్టుంది. లక్ష్మి అమితంగా ప్రేమించే కొడుకు పాత్రలో రావురమేష్ చేసినట్లున్నారు. నాగసౌర్య, రాజేంద్రప్రసాద్, లక్ష్మి అన్ని పాత్రలుఉన్నా కానీ మొత్తం సమంత చుట్టూ తిరిగే కథ అని అర్ధమవుతోంది అసలు చనిపోయిన లక్ష్మి ఏ లక్ష్యం తో సమంత శరీరంలోకి ప్రవేశించింది అన్నదే ఆసక్తికరం.

సంబంధిత సమాచారం :

More