సమంత “ఓహ్ బేబీ” మూవీ ఫస్ట్ లుక్

Published on May 22, 2019 12:29 pm IST

ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ 55 వసంతాలు పూర్తి చేసుకున్న సంధర్భంగా వారి బ్యానర్ లో త్వరలో రాబోతున్న మూవీ “ఓహ్ బేబీ” ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. వైట్ టాప్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని స్మైల్ ఇస్తున్న సమంత వెనుక సీనియర్ నటి లక్ష్మి ఉన్న ఫోటో ఆసక్తి కరంగా ఉంది. సమంత స్వాతిగా కనిపించనుంది.

సౌత్ కొరియన్ చిత్రం “మిస్ గ్రానీ” కి అనువాదంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫాంటసీ కామెడీ జోనర్లో వస్తుంది. 70 ఏండ్ల వృద్ధురాలి ఆత్మ ఓ 20 ఏళ్ల యువతితో ప్రవేశిస్తే ఎలావుంటుందో చెప్పే సంఘటనల సమాహారమే ఈ మూవీ కథ అని తెలుస్తుంది.

నాగశౌర్య, రాజేంద్రప్రసాద్ , ఊర్వశి, రావు రమేష్, ప్రధాన తారాగణం గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ,గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు

సంబంధిత సమాచారం :

More