సమంత నిజంగా ఆ సినిమా కోసమే పేరు మార్చిందా?

Published on Jul 31, 2021 11:00 pm IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడం హాట్ టాఫిక్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత పెళ్లికి ముందు తన హ్యాండిల్స్‌కు “సమంత రుతు ప్రభు” అని పేరు పెట్టుకోగా, అక్కినేని వారసుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న అనంతరం “సమంత అక్కినేని”గా తన హ్యాండిల్స్‌కు పేరును మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇలా పేరు మార్చినందుకు సమంతపై అక్కినేని అభిమానులు ప్రశంసలు కూడా కురిపించారు.

అయితే ఉన్నట్టుండి ఏమయ్యిందో తెలీదు కానీ సమంత తన ట్విట్టర్ హ్యాండిల్‌కు పేరును మార్చింది. సమంత అక్కినేని అని ఉన్న పేరును తొలగించి కేవలం “S” అనే అక్షరాన్ని మాత్రమే ఉంచింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నాగ‌చైత‌న్య‌, స‌మంత మ‌ధ్య ఉన్న అనుబంధంపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటే, సామ్‌ అభిమానులు మాత్రం దీనిపై మరో వాదన వినిపిస్తున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తుందని ఆ ప్రాజెక్ట్ నేపధ్యంలోనే “S” అనే అక్షరాన్ని పెట్టి ఉండొచ్చని చెప్పుకొస్తున్నారు. అయితే నిజంగా ఈ సినిమా కోసమే సమంత పేరు మార్చిందా లేక ఇతర కారణం ఏమైనా ఉందా అనేది తెలియాలంటే మాత్రం దీనిపై సమంత నోరు విప్పాల్సిందే.

సంబంధిత సమాచారం :