పేరు మార్చుకున్న సమంత… కానీ.. !

Published on Oct 3, 2021 10:05 pm IST

సమంత – నాగచైతన్య విడిపోవడం పై సోషల్ మీడియాలో మరియు రెగ్యులర్ మీడియాలో జరుగుతున్న చర్చ తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంత తన పేరు మార్చుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలకు ‘సమంత’ అని పేరును పెట్టుకున్నారు. అయితే, ఫేస్‌బుక్‌ ఎకౌంట్ కి మాత్రం ఇంకా సమంత అక్కినేని పేరే ఉండటం విశేషం.

పెళ్లికి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదంటూ చిన్మయి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సమంతకి చిన్మయి ప్రాణస్నేహితురాలు. చై-సామ్‌ విడిపోతున్నట్లు ప్రకటించడానికి కొన్ని గంటల ముందే చిన్మయి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ఈ మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ చిన్మయి పోస్ట్ చేసిన మెసేజ్ ఏమిటంటే.. ‘పెళ్లికి ముందు.. మీ ఖర్చులు, ఆదాయం, అప్పులు, మతం, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, పిల్లల పెంపకం పై అభిప్రాయాలు, కుటుంబంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మానసిక ఆరోగ్యం, కలల నివాసం, కెరీర్‌, విద్య, రాజకీయాలపై మీకున్న ఆలోచనలు, వైవాహిక జీవితం, జీవిత భాగస్వామిపై మీకున్న అంచనాల గురించి ముందే చర్చించండి. ఎందుకంటే జీవితానికి ప్రేమ ఒక్కటే సరిపోదు కాబట్టి’ అనే సందేశాన్ని చిన్మయి పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :