‘ది రాజాసాబ్’ ఈవెంట్ లో అభిమానుల అత్యుత్సాహం వల్ల నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన సంఘటన తెలిసిన సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా సమంతకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురు అయింది. తాజాగా హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంత తిరిగి తన కారు వద్దకు వెళ్తూ ఉంది. ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం సమంత మీదకు ఎగబడ్డారు. ఒక్కసారిగా అందరూ ముందుకు రావడంతో.. సమంత ఇబ్బంది పడ్డారు.
అంతలో అలెర్ట్ అయిన సమంత బాడీగార్డ్లు ఆమెను జాగ్రత్తగా కారు ఎక్కించారు. కానీ, ఆ సమయంలో సమంత చాలా ఇబ్బంది పడ్డారు. కానీ, ఆమె బాడీ గార్డ్ లు జాగ్రత్తగా సమంతను కార్ ఎక్కించాక, ఆమె ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మొత్తానికి నెటిజన్లు అభిమానుల తీరును తప్పు పడుతున్నారు.
