సమంతను కదిలించిన చిత్రం.. పొగడ్తలతో ముంచెత్తింది

Published on Dec 1, 2020 9:00 pm IST

ఈమధ్యకాలంలో ఓటీటీ ద్వారా విడుదలై భారీ విజయాన్ని రాబట్టుకున్న చిత్రం ‘ఆకాశం నీ హద్దురా!’. సూర్య హీరోగా నటించగా, సుధా కొంగర దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు, విమర్శకులే కాదు సినీ సెలబ్రిటీలు సైతం సినిమా మీద ప్రసంశలు కురిపిస్తున్నారు. సూర్య నటన, సుధా కొంగర దర్శకత్వం అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత సైతం సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు.

సినిమాను ఫిల్మ్ ఆఫ్ థి ఇయర్ గా అభివర్ణించిన సమంత సూర్య నటనకు, అపర్ణ బాలమురళి పెర్ఫార్మెన్స్ కు, సుధా కొంగర నటనకు ఫిదా అయినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను కోరుకున్న ఇన్స్పిరేషన్ ఇదేనని చెప్పుకొచ్చారు. మంచి సినిమాను అందించినందుకు అమెజాన్ ప్రైమ్ వీడియోకు కూడ అభినందనలు తెలిపారు. అనేక మంది ప్రముఖుల ప్రసంశలు అందుకుంటున్న ఈ చిత్రం ఈ యేడాదిలో ఓటీటీ ద్వారా భారీ విజయాన్ని సాధించిన మొదటి దక్షిణాది చిత్రంగా నిలిచింది. తమిళం, తెలుగు రెండు వెర్షన్లు విజయాన్ని సాధించాయి.

సంబంధిత సమాచారం :

More