‘రభస’ షూటింగ్ లో పాల్గొంటున్న సమంత

Published on Jun 1, 2014 9:52 am IST

SAMANTHA (1)
యంగ్ టైగర్ ఎన్టీఅర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమాలో వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న సమంత హీరోయిన్ గా నటిస్తుంది. చివరి దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కి సమంత ఈరోజు తిరిగి హాజరైంది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలో పూర్తి చేసి, ఆగష్టు 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఅర్ సరసన సమంతతో పాటు ప్రణీత మరో హీరోయిన్ గా నటిస్తుంది. ‘కందిరీగ’ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. త్రీకోన ప్రేమకధగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచి కామెడీ ఉండబోతుంది. ‘రభస’ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :