రంగస్థలం షూటింగ్ పూర్తి చేసిన సమంత !

రంగస్థలం షూటింగ్ పూర్తి చేసిన సమంత !

Published on Feb 3, 2018 9:09 PM IST

ఆ మధ్య బయటికి వచ్చిన ‘రంగస్థలం’ లీక్డ్ పిక్స్ లో సమంతను చూసి అందరూ షాక్ అయ్యారు. కారణం ఏంటంటే ఆ ఫోటోల్లోసమంత అంత న్యాచురల్ గా ఉంది. చిట్టిబాబు గా చరణ్ లక్ష్మి గా సమంత రంగస్థలం లో ఆకట్టుకోబోతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మరి కొన్ని రోజుల్లో సినిమా చిత్రీకరణ ఫినిష్ కానుంది.

మర్చి 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు చిత్ర యూనిట్. సుకుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. ప్రస్తుతం రాజమండ్రి లో ఉన్న చిత్ర యూనిట్ ఐటంసాంగ్ చిత్రికరిస్తోంది. పల్లెటూరు ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించబోతోంది. త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు