ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన నటి !

Published on May 23, 2021 7:00 pm IST

బుల్లితెర నటి ‘సంభావన సేత్‌’ తండ్రి కరోనాతో పోరాడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే, తన తండ్రి మరణానికి కారణం కరోనా కాదు, ఆయనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు అంటూ ఆమె ఆరోపణలు చేస్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్‌ చేస్తూ.. ‘అందరు డాక్టర్లు దేవుళ్లు కాదు. డాక్టర్స్ లో మనలాంటి సామాన్యలను చంపేసే రాక్షసులు కూడా ఉన్నారు. అలాంటి డాక్టర్లే నా తండ్రిని చంపేశారు. తండ్రిని కోల్పోవడం నా జీవితంలో భయంకరమైన సంఘటన.

నా తండ్రి నేర్పిన బాటలోనే నేను న్యాయం కోసం పోరాటం చేస్తాను. నిర్లక్ష్యపు డాక్టర్ల పై నేను చేసే ఈ పోరాటంలో నేను గెలిచినా గెలవకపోయినా వారి నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తాను. నా తండ్రి మరణానికి కారణమైన జైపూర్‌ గోల్డెన్‌ హాస్పిటల్ కి ఇప్పటికే లీగల్‌ నోటీసులు పంపించాము. అందరం కలిసి ఆ రాక్షసులకు శిక్ష పడేలా చేద్దాం. మా కుటుంబానికి జరిగినట్టు ఎవరికైనా అన్యాయం జరిగితే వారందరూ ఈ పోరాటానికి మద్దతు తెలపండి’ అంటూ ‘సంభావన సేత్‌ అభ్యర్థించింది.

సంబంధిత సమాచారం :