ఆగస్ట్ లో థియేటర్ల లోకి సంపూర్ణేష్ బాబు “బజార్ రౌడీ”

Published on Jul 20, 2021 10:06 pm IST


హృదయ కాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కే.ఎస్ పతాకం పై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణ లో వస్తున్న చిత్రం బజార్ రౌడీ. ఈ చిత్రం లో సంపూ కి జోడీ గా మహేశ్వరీ వద్ది హీరోయిన్ గా నటిస్తుంది. వసంత నాగేశ్వర రావు దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో నిర్మాత సందిరెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్ర కథ సంపూ స్టైల్ ను యాడ్ చేసి కుటుంబ కథా చిత్రం గా తీర్చి దిద్దారు అని అన్నారు. నాగేశ్వర రావు తనకున్న అనుభవాన్ని తెరపైకి తీసుకు వచ్చాడు అని అన్నారు. దర్శకుడు డి. వసంత నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ఈ చిత్ర అవకాశాన్ని తనకిచ్చిన సంపూ కి, నిర్మాత కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న సంపూ ను ఇలాంటి పక్కా కమర్షియల్ కథలోని ఆయన స్టైల్ ను యాడ్ చేసి తెరకెక్కించాం అని అన్నారు. ప్రేక్షకులకి నవ్వులు, పాటలు, ఫైట్స్ కిక్కెచ్చే అన్ను హంగులతో అందరి సహాయ సహకారాలతో ఈ చిత్రాన్ని పూర్తీ చేశాం అని అన్నారు. ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని థియేటర్ల లోకి తీసుకు వస్తున్నాం అని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని అన్నారు. ఈ చిత్రం లో నాగినీడు, షియాజి శిండే, పృథ్వి, షఫీ, కత్తి మహేష్, పద్మావతి కీలక పాత్రల్లో నటించారు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :