విక్రమ్ నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు – సంపూర్నేష్ బాబు

విక్రమ్ నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు – సంపూర్నేష్ బాబు

Published on Feb 2, 2015 11:49 PM IST

sampoornesh-vikram
విక్రమ్, సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఎఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న తమిళ సినిమా ’10 ఎండ్రదుకుల్లా’. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కమెడియన్ పాత్రకు బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబును ఎంపిక చేశారు. ఈ అవకాశం పట్ల సంపూర్నేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. విక్రమ్ తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తునట్టు తెలిపారు.

’10 ఎండ్రదుకుల్లా’ సినిమాలో ఓ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించాను. అయితే, నా క్యారెక్టర్ తీరు తెన్నుల గురించి దర్శకుడితో ఇంకా చర్చించలేదు. త్వరలో కలిసి మాట్లాడతాను. చిన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు, విక్రమ్ తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. విక్రమ్ నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అని సంపూర్నేష్ బాబు హిందూస్తాన్ టైమ్స్ పత్రికతో చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు