షకీలా కొడుకు యాండ్రాయుడుని చూశారా?

Published on Jul 29, 2019 11:06 am IST

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘కొబ్బరిమట్ట’. వరల్డ్ రికార్డ్ ట్రైలర్ పేరుతో నిన్న సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ లో మూడున్నర నిమిషాల సుదీర్ఘమైన ఓ డైలాగ్ ని గుక్కతిప్పుకోకుండా సంపూర్ణేష్ బాబు సింగిల్ టేక్ లో చెప్పి ఆశ్చర్యపరిచాడు. మోడరన్ గెట్ అప్ లో భారీ బిల్డ్ అప్ తో కార్ లోనుండి దిగిన సంపూ డైలాగ్ ఇరగదీసాడు.

గ్రామ ప్రజల సమక్షంలో తన తల్లి తో అక్రమ సంబంధం నెరిపి తన పుట్టుకకు, తల్లి అవమానాలకు కారకుడైన ఊరి పెద్ద, పెదరాయుడి అన్యాయాలను ఎదిరిస్తూ, ప్రతీకార శబదం చేసిన సంపూ అదరగొట్టాడు. అన్నగారు ఎన్టీఆర్ ‘దానవీర శూరకర్ణ’ మూవీలోని దుర్యోధనుడు డైలాగులకు స్ఫూర్తిగా రాసుకున్న సుదీర్ఘమైన డైలాగ్ ని చెప్పడానికి సంపూ చాలా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

సంపూ తల్లిగా సీనియర్ మలయాళ నటి షకీలా నటిస్తుండగా, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఓ కీలకపాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే అనేక మార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలకు సిద్ధమైంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :