ప్రమోషన్స్ చింపేస్తున్న సంపూ

Published on Aug 1, 2019 7:01 am IST

ఈసారి ‘కొబ్బరి మట్ట’ తో గట్టిగా కొట్టాలని సంపూర్ణేష్ బాబు ఫిక్స్ అయినట్టున్నాడు. ప్రోమోషన్స్ తన దైన శైలిలో వైవిధ్యంగానిర్వహిస్తూ సినిమాకి ఊహించని ప్రచారం కల్పిస్తున్నాడు. ఇటీవల వరల్డ్ రికార్డ్ ట్రైలర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో ఏక బిగిన గుక్క తిప్పుకోకుండా మూడున్నర నిమిషాల డైలాగ్ చెప్పి ఆశ్చర్య పరిచాడు. తాజాగా ప్రేక్షకులకు ఓ కాంటెస్ట్ పెట్టి, ప్రైజ్ మనీ కూడా ప్రకటించేశాడు.

‘కొబ్బరిమట్ట’ సినిమాలోని డైలాగ్ కానీ, పాటను కానీ, లేక ఓ డాన్స్ మూవ్మెంట్ కానీ పెర్ఫార్మ్ చేసి, ఆ వీడియోని కొబ్బరిమట్ట కాంటెస్ట్ యాష్ టాగ్ తో సోషల్ మీడియా ద్వారా లేదా మెయిల్ ద్వారా వారికి పంపాలట. అలా పంపిన వారిలో నలుగురు విజేతలకు ప్రైజ్ మనీ అందిస్తారట. ఈ మేరకు సంపూ టీమ్ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇలాంటి వినూత్న చర్యలతో సంపూ తన సినిమాను బాగానే జనాల్లోకి తీసుకెళుతున్నాడు.

రూపక్ రోనాల్డ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, షకీలా, కత్తి మహేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :