“లూసిఫర్” రీమేకె్‌లో సముద్రఖని?

Published on Jul 20, 2021 2:35 am IST

మెగస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మళయాళంలో సూపర్ హిట్టైన “లూసిఫర్” సినిమా రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో నుంచి బాగానే మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖనిని సెలెక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.

దర్శకుడు నుంచి నటుడిగా మారిన సముద్రఖని ఈ మధ్య వరుస సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయారు. అలవైకుంఠపురములో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’, మహేశ్ సర్కార్ వారి పాట, ఆర్ఆర్ఆర్‌లో కూడా ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా లూసిఫర్ రీమేక్‌లో ఓ మంచి పాత్రను సముద్రఖనికి ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆచార్య షూటింగ్‌లో ఉన్న చిరంజీవి త్వరలో లూసిఫర్ రీమేక్‌ను స్టార్ట్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం :