పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో వెర్సటైల్ నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ఒకటి. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా పవన్ ఓ కీలక పాత్రలో అయితే నటిస్తున్నారు. మరి ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా దర్శకుడు సముద్రఖని తో పవన్ కి ఉన్న బాండింగ్ ఏ స్థాయిలో ఉందో నిన్న సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా పవన్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ తో తెలిసింది.
ఇక దీనికి బదులుగా లేటెస్ట్ గా అయితే సముద్రఖని కూడ పవన్ పై తన ప్రేమ గౌరవాన్ని చాటుకున్నారు. తెలుగు సహా తన మాతృభాష తమిళ్ లో తాను కూడా రెండు ప్రెస్ నోట్స్ ని రిలీజ్ చేశారు. మరి ఇందులో తాను మాట్లాడుతూ..
“అన్నయ్యా, నా పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మీతో నటుడిగా దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలను నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగేందుకు కావలసిన ధైర్యాన్ని చైతన్యాన్ని నాలో నింపింది. ముఖ్యంగా సమాజం పట్ల మీకున్న ప్రేమ అక్కర నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానినయ్యేలా చేసింది. సదా మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు దృక్పథానికి సహచరుడిపై ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగనే మార్పు సాకారమై, తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు మిమ్మల్ని నడిపించాలని మీకు శక్తి ప్రసాదించాలని ప్రార్ధిస్తాను”. అని సముద్రఖని తెలియజేసారు. దీనితో పవన్ పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
????????????????????????????❤️❤️❤️…. pic.twitter.com/1czuBzRI5J
— P.samuthirakani (@thondankani) April 27, 2023


